యథావిధిగా PGRS కార్యక్రమం: కలెక్టర్

కోనసీమ: అమలాపురం కలెక్టరేట్‌లోని గోదావరి భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) జరుగుతుందని కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో, డివిజన్లలో అర్జీలు, వినతులు స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.