VIDEO: ఏడు మండలాల్లో ముగిసిన పోలింగ్.. గేట్లు క్లోజ్
KMM: జిల్లాలో తొలివిడతగా నిర్వహించిన ఏడు మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. నిర్ణీత సమయం పూర్తికావడంతో అధికారులు పోలింగ్ కేంద్రాల గేట్లను మూసివేశారు. లోపల ఉన్న ఓటర్లకు మాత్రం ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. భోజన విరామం అనంతరం అన్ని కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.