శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

W.G: తణుకు మండలంలోని వేల్పూరు గ్రామంలో ఉన్న కృష్ణనగర్ శ్రీకృష్ణుడి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణానికి ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.