మంగళగిరి ప్రజలకు ముఖ్య గమనిక
GNTR: ఈనెల 21న ఆదివారం అమావాస్య రానున్న నేపథ్యంలో మంగళగిరి నగరంలోని శ్రీ పానకాల లక్ష్మీనరసింహుని ఆలయం ఎగువన ఉన్న గండాలయ స్వామి ఆలయానికి చేరుకునే ఘాట్ రోడ్డును మూసివేస్తున్నట్లు శుక్రవారం ఆలయ కార్యనిర్వాహణాధికారి కోగంటి సునీల్ కుమార్ తెలిపారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.