జిల్లాను అస్తవ్యస్తంగా విభజించారు: అచ్చెన్నాయుడు

జిల్లాను అస్తవ్యస్తంగా విభజించారు: అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం: జిల్లాను గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా విభజించిందని మంత్రి మండిపడ్డారు. విభజనను ఒక ప్లాన్ ప్రకారం అమలు చేయకపోవడంతో చాలా సమస్యలు తలెత్తాయని ధ్వజమెత్తారు. ఈ సమస్యలను పలువురు నేతలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. త్వరలోనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలోని గిరిజనుల అభివృద్ధి కోసం కూటమి సర్కార్ ఎంతో కృషి చేస్తుందన్నారు.