ఇవాళ చికెన్ తింటున్నారా..?
కర్నూలు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్ చికెన్ ధర రూ.200-250, స్కిన్‌లెస్ రూ.230-270 వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఈ ధరలు గత వారంతో పోలిస్తే భారీగా తగ్గినట్లు స్థానికులు పేర్కొన్నారు. కాగా, ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వ్యాపారులు వెల్లడించారు.