VIDEO: నూతన కమిటీ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే

VIDEO: నూతన కమిటీ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే

కృష్ణా: దేవాలయాల్లో ఆధ్యాత్మిక వైభవాలను పెంపొందించేలా ప్రతి ఒక్కరు భక్తి భావంతో కృషి చేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో శ్రీ గౌతమేశ్వర స్వామివారి దేవస్థానం, శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయాల ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారంలో అయన పాల్గొన్నారు. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వైభవాలను పెంపొందించేలా భక్తుల సహకారంతో కమిటీలు పనిచేయాలి సూచించారు.