VIDEO: సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో కార్మికుడికి తీవ్ర గాయాలు
BHPL: జిల్లా కేంద్రంలోని సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్–3 ప్రాజెక్టులో బ్లాస్టింగ్ జరుగుతుండగా శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బండరాయి మీద పడటంతో కాంట్రాక్ట్ కార్మికుడు సాయికుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కార్మికుడిని వెంటనే సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.