జీతం ఇవ్వలేదని లారీని ఎత్తుకెళ్లిన డ్రైవర్

జీతం ఇవ్వలేదని లారీని ఎత్తుకెళ్లిన డ్రైవర్

MLG: జీతం ఇవ్వలేదని ఓ డ్రైవర్ లారీని ఎత్తుకెళ్లిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. గోవిందరావుపేటకు చెందిన వ్యక్తి జీతం విషయంలో లారీ యజమానితో గొడవపడ్డాడు. భూపాలపల్లికి చెందిన లారీ యజమాని GPS ద్వారా లారీని ట్రాక్ చేసి ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జిల్లా కేంద్రంలో పోలీసులు లారీని ఆపే ప్రయత్నం చేయగా... డ్రైవర్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.