అద్దంకి మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన
BPT: అద్దంకి మండలంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (బుజ్జి) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బొమ్మనంపాడు, శంఖవరప్పాడు, ధర్మవరం గ్రామాల జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఉదయం 9:30 గంటలకు బొమ్మనంపాడు, 10:30 గంటలకు శంఖవరప్పాడు, 11:30 గంటలకు ధర్మవరం పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.