సిటిజన్ సర్వేలో పాల్గొనాలి: కలెక్టర్
WNP: తెలంగాణ రైజింగ్- 2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. రాష్ట్రభవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి తగు సలహాలు, సూచనలు స్వీకరించడానికి తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ సిటిజన్ సర్వేను చేపట్టిందని కలెక్టర్ పేర్కొన్నారు.