VIDEO: జాతీయ రహదారిపై జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఏర్పాటు
KNR: గంగాధర మండలం కురిక్యాలలో మంగళవారం పోలీస్ అధికారులు ఆరైవ్-అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని జాతీయ రహదారిపై జీబ్రా క్రాసింగ్ లైన్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. యువత అతివేగంగా వాహనాలను నడపొద్దని సూచించారు. ట్రాఫిక్ నియమాలను దృష్టిలో ఉంచుకుని వాహనాలను నడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ లచ్చయ్య, కానిస్టేబుల్స్ ఉన్నారు.