చరిత్ర సృష్టించే దిశగా ధోనీ

చిన్నస్వామి స్టేడియం వేదికగా కాసేపట్లో RCBతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో CSK కెప్టెన్ ధోనీ ఓ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. కెప్టెన్ కూల్ ఇప్పటివరకు RCBపై 34 మ్యాచ్‌లు ఆడి 49 సిక్సర్లు బాదాడు. ఇవాళ జరిగే మ్యాచ్‌లో మరో సిక్సర్ కొడితే RCBపై 50 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ ప్లేయర్‌గా నిలుస్తాడు.