యాక్సిడెంట్లో టీచర్ మృతి

యాక్సిడెంట్లో టీచర్ మృతి

SRPT: సూర్యాపేట మండలం బాలెంల గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు జ్యోతుల రామకృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంగళవారం సూర్యాపేట నుంచి పాఠశాలకు వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతి పట్ల ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.