బాధిత కుటుంబానికి కలెక్టర్ ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి కలెక్టర్ ఆర్థిక సాయం

CTR: ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దామోదర్ నాయుడు కుటుంబానికి ప్రభుత్వం ద్వారా రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేయడం జరిగిందని కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెనుమూరు జట్టిగుండ్లపల్లికి చెందిన దామోదర నాయుడు ఇటీవల ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సహాయార్థం బాధితుడి భార్య కరుణ కుమారికి నగదు చెక్కును కలెక్టర్ అందజేశారు.