VIDEO: ఆదోని ఆసుపత్రిపై కలెక్టర్ ఆగ్రహం
KRNL: ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డా. సిరి బుధవారం సందర్శించారు. ఆసుపత్రి సమస్యలపై అధికారులను ఆరా తీశారు. వైద్యులు ప్రైవేట్ క్లినిక్‌లు నడుపుతున్నారనే ఫిర్యాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత, మందుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.