'ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుంది'

NLG: నేరేడుగొమ్ములో "జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్" కార్యక్రమంలో భాగంగా వివిధ కాలనీల్లో ఎమ్మెల్యే బాలునాయక్ బుధవారం పర్యటించారు. ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని అక్కడిక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు.