మృతడి కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
SRPT: నాగారం మండలం పస్తాలకి చెందిన కండె సోమయ్య మరణించడంతో సోమవారం ఆయన మృతదేహానికి ఎమ్మెల్యే సామేలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి, రూ.5వేల ఆర్థిక సాయం అందిజేశారు. వారి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తొడుసు లింగయ్య, నాయకులు ఉన్నారు.