మైనింగ్ కంపెనీపై చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎంకు లేఖ

మన్యం: గరుగుబిల్లి మండలంలో నిర్వహిస్తున్న అత్యం మైనింగ్ ప్రైవేట్ కంపెనీపై చర్యలు చేపట్టాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ కోరారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. మండలంలోని 10 గ్రామాలలోని కొండలను మైనింగ్ కంపెనీ ఆక్రమిస్తుందని అన్నారు. దీనిపై ప్రశ్నించిన ఆయా గ్రామ ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు.