జియో ఏడాది ప్లాన్.. గూగుల్ జెమిని ఫ్రీ!

జియో ఏడాది ప్లాన్.. గూగుల్ జెమిని ఫ్రీ!

రిలయన్స్ జియో ఆకర్షణీయమైన వార్షిక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.3,599 రీఛార్జ్‌తో ఏడాది పాటు టెలికాం సేవలు, రూ.35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ కింద 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ప్రతిరోజూ 2.5GB హైస్పీడ్ డేటా, దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు ఉచితంగా పొందవచ్చు.