బద్వేలు నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీస్

బద్వేలు నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీస్

KDP: బద్వేలు ఆర్టీసీ డిపో నుంచి శైవ క్షేత్రమైన అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు ఆదివారం తెలిపారు. ఇందులో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా నాలుగో తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు బద్వేల్ నుంచి రూ. 1250 టికెట్‌తో బస్సు బయలుదేరుతుంది. ఈ మేరకు కడప నుంచి ఉదయం 10:30కు రూ. 1150 టికెట్‌తో బస్సు బయలుదేరుతుందన్నారు.