VIDEO: విద్యార్థిగా మారిన కలెక్టర్

SRPT: చివ్వెంలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థిలా కూర్చుని ఉపాధ్యాయుల బోధన తీరును గమనించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.