VIDEO: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు
HNK: ఐనవోలు మండలం పంతిని శివారులో జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వర్ధన్నపేట నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఇసుక ట్రాక్టర్‌ను వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.