రోడ్డు మరమ్మతు పనులను చేపట్టిన సీఐ
గుంటూరులోని పెదపలకలూరు మెయిన్ రోడ్డులో ప్రమాదకరంగా ఉన్న పెద్ద గుంతలను పూడ్చివేసే పనులను ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగరయ్య మాట్లాడుతూ.. పలకలూరు రోడ్డులోని రత్నగిరి కాలనీ, ఇతర ప్రాంతాల్లో పెద్ద గుంతలను ఇటుకలు, కంకర, సిమెంటుతో పూర్తిగా పూడ్చివేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో మిగిలిన పనులు పూర్తి చేస్తామన్నారు.