నకిలీ పత్తి విత్తనాలపై ఉక్కుపాదం

నకిలీ పత్తి విత్తనాలపై ఉక్కుపాదం

NLG: ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై వ్యవసాయ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు జేడీఏ శ్రవణ్ తెలిపారు. మునుగోడు ప్రాంతాల్లో ఇప్పటికే తనిఖీలు చేపట్టామని, నాగార్జునసాగర్ సరిహద్దుల్లో 24 గంటల నిఘా కోసం ప్రత్యేకంగా చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.