'మంత్రితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే'

KDP: విజయవాడ జక్కంపూడి వరద ప్రాంతాల్లో బుధవారం మంత్రి నారాయణతో కలిసి వరద సహాయక చర్యల్లో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వం నుండి నిత్యావసర సరుకులు, ఆహారం, మెడిసిన్స్ అందుతున్నాయా లేదా అని ప్రజల ద్వారా తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని, భయపడాల్సిన అవసరం లేదన్నారు.