పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు
ATP: గుత్తి మండలం పూలకుంట గ్రామంలో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. సీఐ రామారావు మాట్లాడుతూ.. పేకాట ఆడుతున్నారని తమకు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించమన్నారు. ఇందులో భాగంగా 18 పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 42,230 నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.