తాండూరు మండలంలో 5 నామినేషన్ల రిజక్ట్
VKB: తాండూరు మండలంలోని పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆశించిన వార్డు సభ్యుల అభ్యర్థులకు షాక్ తగిలింది. పోటీ చేసేందుకు వేసిన నామినేషన్ల పరిశీలనలో క్లస్టర్ అధికారులు పలువురు నామినేషన్లు తిరస్కరించారు. గ్రామంలో మహిళా స్థానానికి పురుషుడు నామినేషన్ వేయడం ఇందుకు కారణం. ఆయా క్లస్టర్లలో ఎన్నికల అధికారులు నామినేషన్ల పరిశీలన చేపట్టారు.