ఉప ఎన్నికల్లో YCP క్లీన్ స్వీప్

VZM: జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాల్లో గురువారం నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. భోగాపురం వైస్ ఎంపీపీగా పచ్చిపాల నాగలక్ష్మీ(వైసీపీ) ఎన్నిక కాగా, వివిధ మండలాల్లో మరో పది స్థానాల్లో జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.