మృతుని కుటుంబానికి అండగా మిత్రులు

మృతుని కుటుంబానికి అండగా మిత్రులు

NLG: చిట్యాల పట్టణ 9వ వార్డుకు చెందిన మునుగోటి వెంకన్న అకాల మరణంతో వారి 2006-07 పదో తరగతి మిత్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. అందరూ కలిసి రూ.1,23,000 సేకరించి, వెంకన్న కుమార్తె రేణుక పేరున పోస్టాఫీసులో 'సుకన్య సమృద్ధి యోజన' కింద డిపాజిట్ చేశారు. ఆ పత్రాలను కుటుంబ సభ్యులకు సోమవారం అందజేసి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.