జిల్లాలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

జిల్లాలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

KDP: కమలాపురం శ్రీ వెంకటేశ్వర స్కూల్‌లో రేపు మదర్ థెరిసా సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ఛైర్మన్ జూటూరు విజయ్ కుమార్ తెలిపారు. ఈ శిబిరంలో పూర్తి కంటి పరీక్షలు, నిపుణుల సలహాలు, ఉచిత మందులు, కళ్లద్దాల పంపిణీ జరుగుతుందని తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్‌లు కూడా చేయిస్తారని ఆయన పేర్కొన్నారు.