రేపు ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటన
TG: CM రేవంత్ రెడ్డి రేపు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో నిర్వహించనున్న అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన వెళ్తున్నారు. సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ పర్యటనకు వెళ్లనున్నారు.