కంభంలో ప్రత్యేక ఎన్ఫోర్స్‌మెంట్ డ్రైవ్
ప్రకాశం: కంభం పట్టణంలోని రహదారులపై అనధికార LED, అధిక కాంతి లైట్ల వినియోగంపై శుక్రవారం ప్రత్యేక ఎన్ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ సందర్భంగా మార్పులు చేసిన LED హెడ్‌లైట్లు, ఫ్లాష్ లైట్లు, మల్టీకలర్ లైట్లు అమర్చిన వాహనాలను తనిఖీ చేశారు. నియమాలకు విరుద్ధంగా ఉన్న లైట్లను అక్కడికక్కడే తొలగించి, సంబంధిత వాహనదారులపై చర్యలు తీసుకున్నారు.