వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

SRPT: కోదాడ గిరిజన బాలికల కళాశాల వసతి గృహ విద్యార్థినులు గౌతమి, లక్ష్మీ ప్రసన్న రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించారు. గౌతమి 45 కేజీల విభాగంలో రజిత పతకం, లక్ష్మీ ప్రసన్న 48 కేజీల విభాగంలో కాంస్య పతకాలను సాధించారు. ఈ మేరకు విజేతలను వసతి గృహ సంక్షేమ అధికారి పద్మ నిన్న రాత్రి అభినందించారు.