VIDEO: రూ.3.96 కోట్లతో బైపాస్ అభివృద్ధి పనులు
కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.3.96 కోట్లతో గుడివాడ బైపాస్ రోడ్డును అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. బైపాస్ రోడ్డు అభివృద్ధిపై అధికారులతో మంగళవారం ప్రజావేదిక కార్యాలయంలో ఆయన సమీక్షించారు. ఆలస్యం కాకుండా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. పూర్తి నిబంధనల ప్రకారంగా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు.