VIDEO: గురుకుల విద్యార్థికి పాముకాటు
KMR: జిల్లా కేంద్రంలోని సరంపల్లి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న చరణ్ అనే విద్యార్థిని పాము కాటు వేసింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అతన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పాఠశాల నిర్వాహణ లోపం వల్లే ఇలా జరిగిందని బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.