'ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వండి'
MBNR: ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎప్పటి సమస్యలు అప్పుడు పరిష్కరించేందుకు ప్రయత్నించాలని పెండింగ్ పెట్టొద్దని అన్నారు.