ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో
KMR: బిబిపేట్ మండల కేంద్ర శివారులో కొనసాగుతున్న, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను, గురువారం ఎంపీడీవో పూర్ణచంద్రోదయ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు కల్పిస్తున్న వసతులను, ఫీల్డ్ అసిస్టెంట్‌లను అడిగి తెలుసుకున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి కూలీలు జాగ్రత్తలు వహించాలని సూచించారు.