కోళ్ల ఫారంలో ఉరివేసుకున్న వ్యక్తి మృతి

కోళ్ల ఫారంలో ఉరివేసుకున్న వ్యక్తి మృతి

SS: చిలమత్తూరు మండలం యాగ్ని శెట్టిపల్లి సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో వ్యక్తి ఉరివేసుకుని చనిపోయిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్‌కు చెందిన ఆనంద్ సర్దార్ (కూలీ) భార్యతో జరిగిన కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే ఫారంలో పనిచేసే డ్రైవర్ ఈ విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.