మోదీతో చైనా విదేశాంగ మంత్రి భేటీ

ప్రధాని మోదీతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఢిల్లీలో సమావేశమయ్యారు. వాస్తవాధీన రేఖ (LAC) వద్ద ఉద్రిక్తత, ఇరు దేశాల సంబంధాలపై చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో శాంతి, ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. గత రెండేళ్లుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.