కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలి: వెలిచాల

కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలి: వెలిచాల

KNR: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు ఇన్‌ఛార్జి వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తోటి ఎమ్మెల్యేపై అధికారిక కార్యక్రమంలో దుర్భాషలాడుతూ భౌతికంగా దాడి చేయడం సంస్కారహీనమని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు.