సీఎం రేవంత్‌రెడ్డికి షబ్బీర్ అలీ థ్యాంక్స్
KMR: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో HYDకు చెందిన 45 మంది ఉమ్రా యాత్రికులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై CM రేవంత్ రెడ్డి సత్వరంగా, నిర్ణయాత్మకంగా నిర్వహించిన తీరుపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ధన్యవాదాలు తెలిపారు. దుఃఖంలో ఉన్న బాధితకుటుంబాలకు అండగా నిలిచేందుకు CM ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు తక్షణ సహాయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు.జ