అంగన్వాడి కేంద్రంలో రాత్రికి రాత్రే వెలసిన దేవుని విగ్రహం

అంగన్వాడి కేంద్రంలో రాత్రికి రాత్రే వెలసిన దేవుని విగ్రహం

KDP: మైదుకూరు పట్టణంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మూలబాట అంగన్వాడి కేంద్రంలో మంగళవారం రాత్రి శ్రీకృష్ణుడి విగ్రహం ఆకస్మికంగా వెలసింది. బుధవారం ఉదయం మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించగా, పెద్ద సంఖ్యలో చేరుకున్న స్థానికులు అభ్యంతరం తెలిపారు. ప్రజల ప్రతిఘటనతో అధికారులు వెనుదిరగగా, స్థానికులు ప్రస్తుతం విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు.