విద్యుత్ షాక్‌తో రైతు మృతి
KMR: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పంట పొలాల్లో ఏర్పాటు చేసిన కరెంట్ తీగలు తగిలి మర్లురాం కిష్టయ్య(56) అనే రైతు మృతి చెందాడు. శనివారం పశువుల కోసం గడ్డి కోయడానికి పొలానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కరెంట్ తీగలను తాకడంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్లు సమాచారం.