బస్టాండ్‌లో దొంగలు హల్‌చల్

బస్టాండ్‌లో దొంగలు హల్‌చల్

NLG: మిర్యాలగూడ బస్టాండ్‌లో వరుస దొంగతనాలు ప్రయాణికులను కలవర పెడుతున్నాయి. బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు చేతివాటాన్ని చూపుతున్నారు. తాజాగా ఇవాళ గుర్రంపోడు తండాకు చెందిన కేతావత్ ఆంబాలి అనే ప్రయాణికురాలు బస్సు ఎక్కుతుండగా, ఆమె బ్యాగ్ నుంచి 40 తులాల వెండిని దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.