రేపు నీటి సరఫరా నిలిపివేత..!

రేపు నీటి సరఫరా నిలిపివేత..!

VSP: రోడ్డు విస్తరణ పనుల్లో గంభీరం పైప్‌లైన్ లీకేజీ కారణంగా శుక్రవారం మధురవాడ జోన్ పరిధిలోని వార్డ్ 6 (కొమ్మాది, బక్కన్నపాలెం, PM పాలెం తదితర ప్రాంతాలు), వార్డ్ 8 (మిధిలాపురి వుడా కాలనీ, షిప్‌యార్డ్ లేఅవుట్)లో తాగునీటి సరఫరా ఉండదని GVMC తెలిపింది. అత్యవసరమైతే ట్యాంకర్ల కోసం 7729995960 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.