రాష్ట్రస్థాయి పోటీలకు శశిక్ ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు శశిక్ ఎంపిక

VZM: అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ రాష్ట్రస్థాయి పోటీలకు గజపతినగరం మండలంలోని మధుపాడలో సాయి గౌతమ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన నాలుగవ తరగతి విద్యార్థి గవిరెడ్డి శశిక్ ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ ఎస్ నాయుడు సోమవారం సాయంత్రం తెలిపారు. ఇటీవల విజయనగరంలో జరిగిన జోనల్ స్థాయి పోటీలో శశిక్ మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు చెప్పారు.