ధర్మవరంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

సత్యసాయి: శ్రావణ మాసం సందర్భంగా ధర్మవరం పంపునూరు సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ లలితా నాట్య కళానికేతన్ గురువు బాబు బాలాజీ, 15 మంది శిష్యులు కూచిపూడి, నాగిని, కుంభజ్యోతి, కోలాటం నృత్యాలతో భక్తులను ఆకట్టుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ కళాకారులను ఘనంగా సత్కరించారు.