చలివేంద్రం ప్రారంభించిన ఆర్డీవో
MDK: చేగుంట తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రంను తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి ప్రారంభించారు. దూర ప్రాంతాల నుంచి కార్యాలయాలకు వచ్చే ప్రజలకు తాగునీరు అందించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.