సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: CI
KDP: సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రొద్దుటూరు 3 టౌన్ సీఐ వేణుగోపాల్ సూచించారు. ఆదివారం స్థానిక హోమస్ పేట వీధిలో సీఐ తన సిబ్బందితో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. స్థానికులతో సమావేశం నిర్వహించి, సైబర్ నేరగాల్లు చేసే మోసాల గురించి అవగాహన కల్పించారు. ఓటీపీ, పాస్వర్డ్ వివరాలను రహస్యంగా ఉంచాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని కోరారు.